రష్మి నెంబర్‌ అడిగిన నెటిజన్‌....

by సూర్య | Tue, Mar 12, 2019, 03:50 PM

ప్రముఖ యాంకర్‌ రష్మి గౌతమ్‌కు సోషల్‌మీడియాలో నెటిజన్ల నుంచి కామెంట్లు ఎక్కువగా వస్తుంటాయి. రష్మి కూడా ఎప్పటికప్పుడు దీటుగా సమాధానాలు ఇచ్చి వారి నోళ్లుమూయిస్తుంటారు. తాజాగా రష్మికి ఓ వ్యక్తి నుంచి అనుకోని రిక్వెస్ట్‌ వచ్చింది. నెంబర్‌ కావాలంటూ కొందరు ఆకతాయిలు సెలబ్రిటీలకు సోషల్‌మీడియాలో మెసేజ్‌లు పెట్టడం చూస్తూనే ఉంటాం. కానీ ఓ నెటిజన్‌ మాత్రం రష్మిని తన తండ్రి నెంబర్‌ కావాలని అడిగాడు. ‘హే రష్మి.. ఓ యాడ్‌ షూట్‌ కోసం మిమ్మల్ని సంప్రదించాలని అనుకుంటున్నాను. మీ నాన్న నెంబర్‌ మిస్సయింది. ఏమీ అనుకోకపోతే నాకు మీ నాన్న నెంబర్‌ను పంపించండి’ అని మెసేజ్‌ పెట్టాడు. అనుమానం రాకుండా తన ట్విటర్‌ ఖాతాకు ‘పీఆర్‌ మేనేజ్‌మెంట్‌’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. దాంతో ఆ ట్వీట్‌ చూసి రష్మి షాకయ్యారు. ఎందుకంటే రష్మి చిన్నప్పుడే తన తండ్రిని పోగొట్టుకున్నారు. ఇదే విషయాన్ని సదరు నెటిజన్‌కు వివరిస్తూ.. ‘నాకు పన్నెండేళ్ల వయసున్నప్పుడే నాన్న చనిపోయారు. 


కాబట్టి మా నాన్న నెంబర్‌ నీ దగ్గర ఉండే అవకాశమే లేదు. ఇలా పీఆర్‌ మేనేజ్‌మెంట్ పేరుతో ఇతరులను ఫూల్‌ చేయాలని ప్రయత్నించకు. అమ్మాయిలతో మాట్లాడటానికి ఇదో కొత్త వంక అని నాకు తెలుసు. మీలాంటి వారి వల్లే ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోంది’ అని ఘాటుగా సమాధానమిచ్చారు. అయితే రష్మి రిప్లై ఇవ్వడంపై మరో నెటిజన్‌ స్పందిస్తూ.. ‘మేడమ్‌.. ఇలాంటి విషయాలను పట్టించుకుని వారికి సమాధానాలు ఇవ్వకండి’ అన్నాడు. ఇందుకు రష్మి.. ‘ఎప్పుడూ నాకు, నేను అన్నట్లు ఉండకూడదు. ఇలాంటి విషయాల పట్ల స్పందించాల్సిన బాధ్యత నాపై ఉంది’ అని పేర్కొన్నారు.





Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM