హ‌ర్ర‌ర్ చిత్రంలో జాన్వీకపూర్‌

by సూర్య | Tue, Mar 12, 2019, 03:19 PM

బాలీవుడ్ న‌టుడు రాజ్‌కుమార్ రావ్ మ‌రో హ‌ర్ర‌ర్ కామెడీ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘రూహ్‌ అఫ్‌జా’ అనే టైటిల్ పెట్టాడు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమైంది. హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం. ‘‘ధడక్‌’లో జాన్వీ నటన చిత్రబృందానికి బాగా నచ్చింది. ఈ చిత్రంలోని పాత్రకు ఆమె అయితే చక్కగా సరిపోతుందని భావిస్తున్నారు. రాజ్‌కుమార్‌, జాన్వీ తొలిసారి కలసి నటించడం కూడా ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతుంది. దినేష్‌ విజన్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. కొత్త పెళ్లికొడుకులను తన పాటలతో నిద్రపుచ్చి పెళ్లి కూతుళ్లను ఆవహించే దెయ్యం కథ ఇది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ నేపథ్యంగా కథ సాగుతుంది.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM