ఒకేసారి విడుదలకి సిద్దమౌతున్న 3 చిత్రాలు

by సూర్య | Tue, Sep 26, 2023, 01:26 PM

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను నటించిన 'స్కంద' సెప్టెంబర్ 15న విడుదల కావాల్సి వుంది, అలాగే 'చంద్రముఖి 2' కూడా అదే రోజు విడుదల కావాల్సి వుంది. అయితే సెప్టెంబర్ 28న విడుదలవ్వాల్సిన ప్రభాస్  నటించిన 'సలార్' ఆరోజున కాకుండా వాయిదా పడింది అని తెలిసింది. వెంటనే 'పెదకాపు' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి  తన సినిమా సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. అయితే రామ్ పోతినేని నటించిన 'స్కంద' నిర్మాత కూడా తాము తమ సినిమా విడుదల పోస్టుపోన్ చేస్తున్నాం అని సెప్టెంబర్ 28 న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు.ఇలా మూడు సినిమాలు ఒక్క రోజు తేడాలో విడుదలవడం మంచిదా, అన్ని సినిమాలకి ఆదాయం పడిపోతుంది కదా అని 'పెదకాపు' నిర్మాత రవీందర్ రెడ్డి ని అడిగినప్పుడు, అతను తాను మిగతావాళ్లను అడిగే తమ సినిమా విడుదల తేదీ ప్రకటించాను అని చెప్పారు. ముందుగా సాలార్ పోస్ట్ పోన్ అని తెలిసి, సెప్టెంబర్ 28 వద్దామనుకున్నాం. కానీ అదే తేదీకి 'స్కంద' వస్తుందని విని, ఆ చిత్ర నిర్మాత శ్రీనివాస్ గారితో మాట్లాడాను. ఆయన మేము 15 కే వస్తున్నాం. మీరు 28 వ తేదీ వేసేసుకోండి అన్నారు. కానీ ఆయనకి ఇష్టం లేకపోయినా మళ్లీ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. లేదంటే కాంపిటీషన్ లేకుండా వచ్చే వాళ్ళం, అని వివరణ ఇచ్చారు మిర్యాల రవీందర్ రెడ్డి.

Latest News
 
'యానిమల్' 4 రోజుల ఆస్ట్రేలియా కలెక్షన్ రిపోర్ట్ Tue, Dec 05, 2023, 08:54 PM
'జోరుగాహుషారుగా' ట్రైలర్ లాంచ్ చేయనున్న స్టార్ డైరెక్టర్ Tue, Dec 05, 2023, 08:51 PM
25 మిలియన్ వ్యూస్ ని సాధించిన 'సుట్టంలాసూసి' లిరికల్ పాట Tue, Dec 05, 2023, 06:45 PM
'బబుల్‌గమ్‌' మూడవ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Tue, Dec 05, 2023, 06:26 PM
'హాయ్ నాన్న' హిందీ థియేట్రికల్ రైట్స్ పై లేటెస్ట్ అప్డేట్ Tue, Dec 05, 2023, 06:23 PM