by సూర్య | Fri, Jun 09, 2023, 08:57 PM
శ్రీకాంత్ జి రెడ్డి రచన మరియు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నరేష్ అగస్త్య నటించిన 'మెన్ టూ' చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద ప్రేక్షకులని ఆకట్టుకోవటంలో విఫలమైంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా ప్లాట్‌ఫారమ్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ తెలుగు కామెడీ జూన్ 9, 2023న ఆహా ప్లాట్‌ఫారమ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ, మౌర్య సిద్దవరం, కౌశిక్ ఘంటసాల, ఆశ్రిత, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లాంతర్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై మౌర్య సిద్దవరం నిర్మించిన ఈ చిత్రానికి ఎలిషా ప్రవీణ్ సంగీతం అందించారు.