OTTలో సెన్సేషన్ సృష్టిస్తున్న '2018'

by సూర్య | Thu, Jun 08, 2023, 04:43 PM

జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన '2018' చిత్రం విడుదలై మాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సోనీ LIVసొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం జూన్ 7, 2023న మలయాళ వెర్షన్, తెలుగు, తమిళం, హిందీ మరియు కన్నడతో సహా ఇతర భాషలలో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన తర్వాత, ఈ చిత్రం OTTలో తన జోరు ని ప్రారంభించింది. ప్రస్తుతం 2018 సినిమా సోనీ LIV ఇండియాలో అగ్రస్థానంలో ఉంది.

ఈ చిత్రంలో కుంచాకో బోబన్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి, కలైయరసన్, నరేన్, లాల్, ఇంద్రన్స్, అజు వర్గీస్ మరియు తన్వి రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం నోబిన్ పాల్ అందించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ మరియు పికె ప్రైమ్ ప్రొడక్షన్‌లు ఈ సినిమాని నిర్మించాయి.

Latest News
 
రీ-రిలీజ్ ఉన్న సిద్ధంగా ఉన్న "రౌడీ బాయ్స్‌" Tue, Apr 23, 2024, 03:19 PM
రేపు విడుదల కానున్న 'హరోమ్ హర' సెకండ్ సింగల్ Tue, Apr 23, 2024, 03:17 PM
ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు Tue, Apr 23, 2024, 03:16 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'హనుమాన్' Tue, Apr 23, 2024, 03:07 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'ఇంద్రాణి' Tue, Apr 23, 2024, 03:05 PM