రేపు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'కస్టడీ'

by సూర్య | Thu, Jun 08, 2023, 04:17 PM

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన 'కస్టడీ' సినిమా మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కాప్ డ్రామా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో జూన్ 9, 2023 నుండి OTT ప్లాట్‌ఫారమ్‌లో ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషలలో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని సమాచారం.


కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రంలో నాగచైతన్య సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి జోడిగా కనిపించనుంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి, ప్రియమణి, నరేష్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాధ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ తెలుగు-తమిళ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ నిర్మిస్తోంది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM