శ్రీలీల షాకింగ్ కామెంట్స్ వైరల్

by సూర్య | Thu, Jun 08, 2023, 04:01 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు శ్రీలీల  పేరు సమాధానంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ప్రతి ప్రాజెక్ట్ లో శ్రీలీల పేరు వినిపిస్తుండటంతో శ్రీలీల అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. తాజాగా ఢీ షోకు గెస్ట్ గా హాజరైన శ్రీలీల తనకు బాల్యంలో ఎదురైన కష్టాల గురించి చెప్పుకొచ్చారు. యాంకర్ ప్రదీప్ శ్రీలీలను చూసి ఇప్పుడు స్టేజ్ కు అసలైన కల వచ్చిందని చెప్పారు.మీకు డ్యాన్స్ కు ఎంత దగ్గరి సంబంధం అని ప్రదీప్ అడగగా శ్రీలీల మాట్లాడుతూ నాకు మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచి డ్యాన్స్ తో సంబంధం ఉందని ఆమె అన్నారు. నాకు సరిగ్గా నడవడం వచ్చో లేదో తెలీదు కానీ మా అమ్మ ముందు డ్యాన్స్ క్లాస్ కు పంపించేదని శ్రీలీల పేర్కొన్నారు. ఆ సమయంలో కాళ్లకు బొబ్బలు వచ్చేవని ఆమె తెలిపారు. మూడేళ్ల వయస్సులోనే డ్యాన్స్ కోసం అలాంటి టార్చర్ అనుభవించానని శ్రీలీల పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఆ సమయంలో అమ్మను నేను తిట్టుకునేదానినని ఏంటమ్మా టార్చర్ అమ్మ ఇదీ అని కామెంట్ చేసేదానినని శ్రీలీల అభిప్రాయం వ్యక్తం చేశారు. స్కూల్ కెళ్లిపోతానమ్మ త్వరగా స్కూల్ లో జాయిన్ అయిపోతానమ్మ అని చెప్పేదానినని శ్రీలీల పేర్కొన్నారు. శ్రీలీల తనకు బాల్యంలో ఎదురైన జ్ఞాపకాలను పంచుకోగా ఆ తర్వాత హైపర్ ఆది శ్రీలీలను ఇమిటేట్ చేయడం గమనార్హం.యాంకర్ ప్రదీప్ డ్యాన్స్ కు మీకు ఏంటి సార్ సంబంధం అని అడగగా ఇది ఇప్పుడు కాదని నాకు మూడేళ్లు ఉన్న సమయంలో నాన్నగారు నేర్చుకోరా డ్యాన్స్ అని ఇబ్బంది పెట్టారని ఒళ్లంతా బొబ్బలు వచ్చేవని ఆది చెప్పుకొచ్చారు. నాన్న ఇంటికొచ్చాక నేను స్కూల్ కెళతానని నా వల్ల కాదని చెప్పానని హైపర్ ఆది పేర్కొన్నారు. డ్యాన్స్ చేస్తే కాళ్లకు రావాలి కదా మొహమంతా ఎలా వచ్చాయని ప్రదీప్ అడగగా ఫ్లోర్ మూమెంట్స్ అని ఆది సమాధానం ఇచ్చారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM