రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం

by సూర్య | Thu, Jun 08, 2023, 12:51 PM

మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం అంటూ కొన్నిరోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని వరుణ్‌ తేజ్‌ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. వరుణ్ తేజ్ టీం నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను షేర్ చేశారు. 


జూన్ 9న వరుణ్, లావణ్య ఎంగేజ్ మెంట్ జరగనున్నట్లు ఈ పత్రిక ద్వారా తెలుస్తోంది. ఊహించినట్లుగానే దీనిపై అధికారిక క్లారిటీ వచ్చింది. మరి వీరిద్దరూ అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు కానీ ఇప్పుడు జూన్ 9న పెద్దల సమక్షంలో నిశ్చితార్థానికి సిద్ధమవుతున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఈ శుభవార్తతో అభిమానులు మరియు ఫిల్మ్ సర్కిల్స్ యువ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM