భావన పాన్-ఇండియన్ హారర్ థ్రిల్లర్‌కు టైటిల్ లాక్

by సూర్య | Tue, Jun 06, 2023, 08:52 PM

నూతన దర్శకుడు జైద్దేవ్ దర్శకత్వంలో మలయాళ బ్యూటీ భావన తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ రోజు నటి భావన పుట్టినరోజున మూవీ మేకర్స్ ఆన్‌లైన్‌లో ఈ సినిమా యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇంటెన్సివ్‌గా మరియు ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

హారర్ థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి 'ది డోర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో భావనతో పాటు గణేష్ వెంకట్రామ్, జయప్రకాష్, నందు, శ్రీరంజని వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.


జూన్‌డ్రీమ్స్ స్టూడియోపై నవీన్ రాజన్ నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియన్ మూవీని తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ ఉన్ని సంగీతం అందించారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'జయ జానకి నాయక' Wed, Apr 24, 2024, 02:35 PM
ఓపెన్ అయ్యిన 'రత్నం' బుకింగ్స్ Wed, Apr 24, 2024, 02:27 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ ప్రోమో విడుదలకి టైమ్ లాక్ Wed, Apr 24, 2024, 02:25 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Wed, Apr 24, 2024, 02:23 PM
నేడు విడుదల కానున్న 'హరోమ్ హర' లోని కనులెందుకో ఫుల్ సాంగ్ Wed, Apr 24, 2024, 02:21 PM