'ఇండియన్ 2' లో SJ సూర్య?

by సూర్య | Tue, Jun 06, 2023, 08:50 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న కోలీవుడ్ నటుడు ఎస్‌జే సూర్య 'ఇండియన్ 2' లో ప్రధాన విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. అయితే, మూవీ టీమ్ నుండి ఈ విషయం గురించి అధికారిక ధృవీకరణ ఇంకా ఇవ్వనప్పటికీ సోషల్ మీడియాలో ఈ రూమర్ చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

Latest News
 
రోడ్డు ప్రమాదానికి గురైన బుల్లితెర నటి Fri, Apr 19, 2024, 01:43 PM
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ Fri, Apr 19, 2024, 01:42 PM
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM