OTT విడుదల తేదీని లాక్ చేసిన 'మెన్ టూ'

by సూర్య | Mon, Jun 05, 2023, 08:21 PM

శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నరేష్ అగస్త్య నటించిన 'మెన్ టూ' చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద ప్రేక్షకులని ఆకట్టుకోవటంలో విఫలమైంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా ప్లాట్‌ఫారమ్‌ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ తెలుగు కామెడీ జూన్ 9, 2023న ఆహా ప్లాట్‌ఫారమ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.

బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ, మౌర్య సిద్దవరం, కౌశిక్ ఘంటసాల, ఆశ్రిత, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసారు. లాంతర్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై మౌర్య సిద్దవరం నిర్మించిన ఈ చిత్రానికి ఎలిషా ప్రవీణ్ సంగీతం అందించారు.

Latest News
 
500 మంది మహిళలకు ఉచిత క్యాన్సర్ చికిత్స అందించిన సోనూసూద్ Wed, Dec 17, 2025, 11:44 AM
రేపు ప్రభాస్ 'రాజాసాబ్' పాట విడుదల Wed, Dec 17, 2025, 10:45 AM
Peddi Movie: ‘చికిరీ చికిరీ’ సాంగ్ సెన్చురీ! మాస్ క్రేజ్ కాస్త అదిరిపోయింది Tue, Dec 16, 2025, 10:22 PM
Vrushabha: మోహన్ లాల్ అభిమానులు గుడ్ న్యూస్! రిలీజ్ డేట్ లాక్ అయింది Tue, Dec 16, 2025, 10:00 PM
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా.. ఇపుడు అదే హీరోతో హీరోయిన్‌గా Tue, Dec 16, 2025, 07:42 PM