ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకున్న 'బింబిసార'

by సూర్య | Fri, Mar 24, 2023, 07:43 PM

మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఇప్పుడు, శ్రీకళాసుధ తెలుగు సంఘం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన 25వ ఉగాది అవార్డుల ప్రదానోత్సవంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఉత్తమ నటుడిగా, అంతేకాకుండా ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డ్స్ ని సొంతం చేసుకున్నాయి. చెన్నైలోని రాయపేటలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బింబిసార సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె హరి కృష్ణ నిర్మిస్తున్నారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM