సెన్సార్ బోర్డ్ నుండి 'A' సర్టిఫికేట్ పొందిన 'విడుతలై'

by సూర్య | Thu, Mar 23, 2023, 08:45 PM

వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ కమెడియన్ సూరి ఒక ఎంటర్టైనర్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'విడుతలై' అనే టైటిల్ ని లాక్ చేసారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి టీచర్‌గా నటిస్తుండగా, సూరి పోలీసుగా నటిస్తున్నారు.

తాజా అప్డేట్ ప్రకారం, విడుదలై పార్ట్ 1 సెన్సార్ బోర్డ్ నుండి 'A' సర్టిఫికేట్ పొందినట్లు సమాచారం. ఈ సినిమా మార్చి 31న పెద్ద తెరపైకి రానుంది. ఈ చిత్రంలో భవానీ శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతం వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM
'విశ్వంభర' కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ Wed, Apr 17, 2024, 08:30 PM