జయం రవి తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ఆస్కార్ విన్నింగ్ మ్యూసిషన్

by సూర్య | Thu, Mar 23, 2023, 08:23 PM

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి 'పొన్నియిన్ సెల్వన్-2' లో కనిపించనున్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 28, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నటుడి 32వ సినిమాని ఒక నూతన దర్శకుడు డైరెక్ట్ చేయనున్నట్లు  సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన బజ్ చక్కర్లు కొడుతోంది. 100 కోట్లకి పైగా బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు సమాచారం.


అంతేకాకుండా ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం, ఆస్కార్-విజేత AR రెహమాన్ ఈ భారీ బడ్జెట్ మూవీకి సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా 18 భాషలలో విడుదల అవుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సమ్మర్‌లో షూటింగ్ ప్రారంభం కానుందని లేటెస్ట్ టాక్. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM