లేటెస్ట్ : 'జైలర్' లో బాలీవుడ్ విలక్షణ నటుడు ..!!

by సూర్య | Mon, Feb 06, 2023, 10:11 AM

సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో "జైలర్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి మేకర్స్ ఒక్కొక్క కీలకపాత్రను పరిచయం చేస్తూ, సినిమాపై ఆడియన్స్ అటెన్షన్ ను రోజురోజుకూ పెంచుతున్నారు.


ఈ మేరకు జైలర్ లో కన్నడ 'కరునాడ చక్రవర్తి' శివరాజ్ కుమార్ గారు, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్,  కమెడియన్ సునీల్, మిల్కీ బ్యూటీ తమన్నానటిస్తున్నారని అధికారికంగా తెలుస్తుంది. తాజాగా జైలర్ లో బాలీవుడ్ విలక్షణ నటుడు జాకీ ష్రాఫ్ కూడా ఒక భాగమే అని పేర్కొంటూ సెట్స్ నుండి ఆయన క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేసారు.


రమ్యకృష్ణ, యోగిబాబు కీరోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM