లేటెస్ట్ : ఎన్టీఆర్ 30 పై తారక్ సెన్సేషనల్ అప్డేట్స్ ..!!

by సూర్య | Mon, Feb 06, 2023, 09:43 AM

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం "అమిగోస్" ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ 30 పై తారక్ సెన్సేషనల్ అప్డేట్స్ రివీల్ చేసారు. ఏదైనా అప్డేట్ ఉంటే ఇంట్లోని భార్య కన్నా ముందు అభిమానులతోనే పంచుకుంటానని, ఎందుకంటే, వారే తనకు అత్యంత ముఖ్యమని చెప్పారు. ఎన్టీఆర్ 30 ఈ నెలలోనే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కాబోతుందని, వచ్చే నెల 20లోపు సెట్స్ పైకి తీసుకెళ్తామని, ఏప్రిల్ 5, 2024లో విడుదల చేస్తామని చెప్పి, అభిమానుల్లో నెలకొన్న సందిగ్ధతను పటాపంచలు చేసారు. వారిలో ఫుల్ ఖుషిని నింపారు.


పోతే, ఎన్టీఆర్ 30 సినిమాను తారక్ కొరటాల శివ డైరెక్షన్లో చెయ్యబోతున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్త బ్యానర్లపై హరికృష్ణ కే, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
కార్తీ తదుపరి చిత్రంలో ప్రముఖ హీరో కీలక పాత్ర Fri, Jun 02, 2023, 08:56 PM
OTT ప్లాట్‌ఫారమ్‌ను లాక్ చేసిన 'పరేషన్' Fri, Jun 02, 2023, 08:54 PM
'మేమ్ ఫేమస్' 7 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 07:00 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఉగ్రం' Fri, Jun 02, 2023, 06:51 PM
'బిచ్చగాడు 2' 13 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:42 PM