![]() |
![]() |
by సూర్య | Sun, Feb 05, 2023, 07:24 PM
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కమర్షియల్ యాడ్స్ లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. అతి త్వరలోనే మధ్యలోనే ఆగిపోయిన ఖుషి షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఆపై జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి మూవీ ఎలానూ లైన్లోనే ఉంది. ఇంకా మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఇలా చూసుకుంటే, రౌడీ హీరో నుండి ఏడాదికో సినిమా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఇప్పుడు రౌడీ హీరో అప్ కమింగ్ డైరెక్టర్ల లిస్టులోకి పరశురామ్ పెట్ల కూడా చేరారు. విజయ్ కి గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పరశురామ్ ఇప్పుడు విజయ్ తో రెండో సినిమాను ప్లాన్ చేస్తున్నారని వినికిడి. బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఈ ప్రాజెక్ట్ కి నిర్మాతగా వ్యవహరిస్తారట. వినటానికి ఈ వార్త చాలా ఎక్జయిటింగ్ గా ఉంది కానీ, ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
Latest News