మరోసారి వాయిదా పడిన పవన్ కళ్యాణ్ 'బద్రి' రీ రిలీజ్..!!

by సూర్య | Fri, Feb 03, 2023, 10:06 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, ఖుషి సినిమాలు ఇప్పటికే మరోసారి థియేటర్లకు వచ్చి అభిమానులను ఉర్రూతలూగించగా,  పవర్ నటించిన మరొక సూపర్ హిట్ మూవీ కూడా రీ రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. అదే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన "బద్రి".


వాస్తవానికి రిపబ్లిక్ డే రోజునే ఈ సినిమా రీ రిలీజ్ కావలసి ఉండగా, ఫిబ్రవరి నాల్గవ తేదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి నాలుగు నుండి 18వ తేదికి మరోసారి బద్రి మూవీని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. 


రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రమణగోగుల సంగీతం అందించారు. విజయలక్ష్మి మూవీస్ బ్యానర్ పై టి. త్రివిక్రమరావు నిర్మించారు. 20 ఏప్రిల్, 2000లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Latest News
 
'ధమ్కీ' 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Mar 25, 2023, 08:58 PM
'రంగమార్తాండ' 3 రోజుల USA బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Sat, Mar 25, 2023, 08:50 PM
OTTలో ప్రసారానికి అందుబాటులో ఈషా రెబ్బా మలయాళ తొలి చిత్రం Sat, Mar 25, 2023, 08:34 PM
యువ దర్శకుడి స్క్రిప్ట్‌ని ఒకే చేసిన నాగ చైతన్య? Sat, Mar 25, 2023, 08:21 PM
ఇటలీలో 'సాలార్' యాక్షన్ సీక్వెన్స్ Sat, Mar 25, 2023, 08:19 PM