![]() |
![]() |
by సూర్య | Fri, Feb 03, 2023, 09:49 AM
ఈ ఏడాది సీనియర్ నటీమణి జమున గారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి గారు, దర్శకుడు విద్యాసాగర్ గారు వరసగా టాలీవుడ్ కి దూరమై, విషాదాన్ని మిగిల్చారు. ఇప్పుడు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు కాలం చేసారు. దీంతో టాలీవుడ్ లో విషాదపు ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీప్రముఖులు కళాతపస్వి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది.. మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో ఎమోషనల్ గా చేసిన ట్వీట్ గురించి.
ఈ ట్వీట్ లో కళాతపస్విని గురువు గారని పేర్కొంటూనే, అంతకన్నా ఎక్కువ.. పితృసమానులని చిరు పేర్కొన్నారు. ఆయన గొప్పతనం గురించి చెప్పటానికి మాటలు చాలవని, శుభలేఖ, స్వయంకృషి, ఆపద్భాంధవుడు వంటి మూడు చిత్రాలని ఆయన దర్శకత్వంలో చెయ్యడం తన అదృష్టమని, ఆయనతో గడిపిన సమయం తనకు అత్యంత విలువైనదని తెలిపారు. ఆయన మరణం భారతీయ సినీపరిశ్రమకు, తెలుగు వారికీ తీరని లోటని, ఈ సందర్భంగా విశ్వనాథ్ గారి కుటుంబ సభ్యులకు, అసంఖ్యాకమైన అభిమానులందరికీ ప్రగాఢ సానుభూతిని చిరంజీవి తెలియచేసారు.
Latest News