![]() |
![]() |
by సూర్య | Fri, Feb 03, 2023, 09:33 AM
నేషనల్ అవార్డు విన్నర్, "కలర్ ఫోటో" దర్శకుడు సందీప్ రాజ్ అందించిన కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో మరో డైరెక్టర్ గంగాధర్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లింగ్ డ్రామా "ముఖచిత్రం". ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కీరోల్ ప్లే చేసారు.
వికాస్ వసిష్ఠ, ప్రియా వడ్లమాని, చైతన్య రావు, అయేషా ఖాన్, రవిశంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 9న థియేటర్లలో విడుదలై, ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది.
తాజాగా నిన్న అర్ధరాత్రి నుండి ఆహా ఓటిటిలో ముఖచిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. మరి, డిజిటల్ ఆడియన్స్ నుండి ముఖచిత్రం సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Latest News