'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!!

by సూర్య | Thu, Feb 02, 2023, 07:22 PM

రేపు విడుదల కాబోతున్న సినిమాలలో నటుడు సుహాస్ హీరోగా నటిస్తున్న "రైటర్ పద్మభూషణ్" ఒకటి. ప్రశాంత్ షణ్ముఖ్ డైరెక్షన్లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.


ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆపై ఫ్యామిలీస్ కి స్పెషల్ స్క్రీనింగ్స్ వేసి, మరింత హైప్ సంపాదించుకుంది. ఆ తర్వాత టికెట్ రేట్లను బడ్జెట్ రేంజ్ లో ఉంచి, ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఈ నేపథ్యంలో రేపు విడుదల కాబోతున్న రైటర్ పద్మభూషణ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


తాజాగా రైటర్ పద్మభూషణ్ చిత్రబృందానికి మాస్ రాజా రవితేజ బెస్ట్ విషెస్ తెలియచేస్తూ ట్వీట్ చేసారు. ఈ సినిమా గురించి తాను అన్ని పాజిటివ్ రివ్యూలే విన్నానని, సినీరంగంలో సుహాస్ ఎంతో కష్టపడి పైకి వచ్చారని, అతనికి ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా రేపు విడుదల కాబోతున్న రైటర్ పద్మభూషణ్ చిత్రబృందానికి రవితేజ బెస్ట్ విషెస్ తెలియచేసారు.  

Latest News
 
'కబ్జా' 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Mar 28, 2023, 02:37 PM
'బలగం' 24 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Mar 28, 2023, 02:24 PM
'వినరో భాగ్యము విష్ణు కథ' 36 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Mar 28, 2023, 02:19 PM
'ధమ్కీ' 5 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Tue, Mar 28, 2023, 02:12 PM
'రంగమార్తాండ' 5 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Mar 28, 2023, 02:06 PM