'RC15' సినిమాపై లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Mon, Jan 30, 2023, 07:02 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'RC15' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఒక పాత్రలో ఐఏఎస్ అధికారిగా, మరో పాత్రలో పల్లెటూరి వ్యక్తిగా కనిపించనున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మెగా మూవీని 2024 సంక్రాంతికి విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ బజ్. అయితే, ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అంతేకాకుండా రామ్ చరణ్ పుట్టినరోజున RC15 ఫస్ట్ లుక్ విడుదల కానుందని మరో గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
ఒకేసారి విడుదలకి సిద్దమౌతున్న 3 చిత్రాలు Tue, Sep 26, 2023, 01:26 PM
ఇందులో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ Tue, Sep 26, 2023, 01:16 PM
అందరికి ఈ సినిమా స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది Tue, Sep 26, 2023, 01:12 PM
మాకు తెలియకుండా విగ్రహం పెట్టారు Tue, Sep 26, 2023, 01:06 PM
విజయ్ దేవరకొండ​ సినిమా నుంచి శ్రీలీల ఔట్​ Tue, Sep 26, 2023, 12:35 PM