'మైఖేల్' గ్రాండ్ ఈవెంట్ కోసం నాచురల్ స్టార్..!

by సూర్య | Mon, Jan 30, 2023, 05:55 PM

ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పిన 'మైఖేల్' చిత్రబృందం తాజాగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రెడీ ఐన విషయం తెలిసిందే. ఈ మేరకు జనవరి 31వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి హైదరాబాద్ JRC కన్వెన్షన్స్ లో మైఖేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని నిన్ననే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. తాజాగా ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా నాచురల్ స్టార్ నాని హాజరు కాబోతున్నట్టు సరికొత్త ప్రకటన చేసారు. పోతే, వచ్చే నెల 3వ తేదీన మైఖేల్ పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.


రంజిత్ జయకొడి డైరెక్షన్లో యంగ్ హీరో సందీప్ కిషన్, దివ్యాన్ష కౌశిక్ జంటగా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయా భరద్వాజ్ కీలకపాత్రల్లో నటించారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు. 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM