![]() |
![]() |
by సూర్య | Mon, Jan 30, 2023, 05:24 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజీత్ డైరెక్షన్లో ఒక సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి, ఈ రోజే అఫీషియల్ పూజా కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రముఖ సినీ సెలెబ్రిటీలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ దగ్గుబాటి, BVSN ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. అల్లు అరవింద్ గారు ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. సురేష్ దగ్గుబాటి గారు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. అతి త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేసారు.
DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య గారు ఈ సినిమాను నిర్మించనున్నారు. రవి కే చంద్రన్ గారు సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఈ మేరకు విడుదలైన అఫీషియల్ పోస్టర్ ప్రేక్షకుల అటెన్షన్ ఇట్టే గ్రాస్ప్ చేసింది.
Latest News