నెగెటివ్ పాత్రలో కనిపించనున్న ఐశ్వర్య రాయ్ ?

by సూర్య | Mon, Jan 30, 2023, 03:58 PM

మహేశ్ బాబు తన కెరియర్ లో 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. హారిక అండ్ హాసిని బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. పొలిటికల్ టచ్ తో ఈ కథ నడుస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే కనిపించనుంది. మరో ముఖ్యమైన పాత్రలో శ్రీలీల అలరించనుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ తన సినిమాల్లోని కీలకమైన పాత్రలని సీనియర్ హీరోయిన్స్ తో చేయిస్తుంటారు. అలా ఆయన నదియా .. ఖుష్బూ .. స్నేహ .. టబు వంటివారిని రంగంలోకి దింపారు. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ పేరు వినిపిస్తోంది. 


ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ పాత్ర నెగెటివ్ షేడ్స్ ను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కావడం వల్లనే ఆమెను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. ఆల్రెడీ 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో ఐశ్వర్యరాయ్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించింది. సెకండ్ పార్టులో ఆమె విలనిజంపై ఎక్కువ ఫోకస్ ఉండనుంది. మరి మహేశ్ మూవీలో త్రివిక్రమ్ ఆమెను ఎలా చూపిస్తాడో చూడాలి.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM