ఈరోజు సాయంత్రమే వీరయ్య విజయ విహారం వేడుకలు..!!

by సూర్య | Sat, Jan 28, 2023, 11:58 AM

మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన కొత్త చిత్రం "వాల్తేరు వీరయ్య". సంక్రాంతి కానుకగా ధియేటర్లకొచ్చి, అశేష ప్రేక్షకాభిమానుల నీరాజనాలు అందుకుంటున్న ఈ సినిమా 'వీరయ్య విజయ విహారం' పేరిట గ్రాండ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుపుకోనుంది. ఈ మేరకు సాయంత్రం ఆరింటి నుండి యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, సుబేదారి, హన్మకొండలో వీరయ్య విజయ విహారం కార్యక్రమం జరగబోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్న విషయం తెలిసిందే.


ఈ సినిమా రీసెంట్గానే 100కోట్ల షేర్ ను రాబట్టింది. డైరెక్టర్ బాబీ రూపొందించిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో మాస్ రాజా రవితేజ క్రూషియల్ రోల్ లో నటించారు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Latest News
 
'ధమ్కీ' 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Mar 25, 2023, 08:58 PM
'రంగమార్తాండ' 3 రోజుల USA బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Sat, Mar 25, 2023, 08:50 PM
OTTలో ప్రసారానికి అందుబాటులో ఈషా రెబ్బా మలయాళ తొలి చిత్రం Sat, Mar 25, 2023, 08:34 PM
యువ దర్శకుడి స్క్రిప్ట్‌ని ఒకే చేసిన నాగ చైతన్య? Sat, Mar 25, 2023, 08:21 PM
ఇటలీలో 'సాలార్' యాక్షన్ సీక్వెన్స్ Sat, Mar 25, 2023, 08:19 PM