విభిన్నంగా ప్రచారం చేస్తున్న 'రైటర్ పద్మభూషణ్' చిత్రబృందం..  

by సూర్య | Fri, Jan 27, 2023, 03:26 PM

'కలర్ ఫోటో' ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం "రైటర్ పద్మభూషణ్". ఈ సినిమాతో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా పరిచయమవుతుంది. కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.


వచ్చే నెల 3వ తేదీన థియేటర్లకు రాబోతున్న పద్మభూషణ్ కుటుంబం విభిన్న ప్రచార కార్యక్రమాలను చేపట్టి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ మేరకు రైటర్ పద్మభూషణ్ చిత్రబృందం ఆంధ్రా తెలంగాణాలలోని కాలనీలను విజిట్ చేసి, తమ సినిమా ప్రీ రిలీజ్ స్క్రీనింగ్స్ కి ఫ్యామిలీలను ఆహ్వానించే విభిన్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ రోజు విజయవాడలో, రేపు గుంటూరు, ఎల్లుండి భీమవరం, ఆ తరవాత కాకినాడ, వైజాగ్, హైదరాబాద్ లలో రైటర్ పద్మభూషణ్ ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ జరగనుంది.  

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదలకి తేదీ ఖరారు Fri, Apr 19, 2024, 04:49 PM
OTT పార్టనర్ ని లాక్ చేసిన 'బడే మియాన్ చోటే మియాన్' Fri, Apr 19, 2024, 04:46 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన '777 చార్లీ' హిందీ వెర్షన్ Fri, Apr 19, 2024, 04:22 PM
'లవ్ మౌళి' ట్రైలర్ రిలీజ్ Fri, Apr 19, 2024, 04:20 PM
భారీ మొత్తానికి అమ్ముడయిన 'గేమ్ ఛేంజర్' నార్త్ అమెరికా రైట్స్ Fri, Apr 19, 2024, 04:18 PM