సల్మాన్ "కిసీ కా భాయ్ కిసీ కి జాన్" టీజర్.. కలర్ఫుల్ & మాస్సీ

by సూర్య | Wed, Jan 25, 2023, 05:02 PM

అనుకున్నదే జరిగింది... ఈరోజు నుండి ప్రేక్షకులను అలరించడం మొదలెట్టిన షారుఖ్ ఖాన్ "పఠాన్" మూవీ షో టైం లో సల్మాన్ ఖాన్ "కిసీ కా భాయ్ కిసీ కి జాన్" టీజర్ స్క్రీనింగ్ జరిగింది. కాసేపటి క్రితమే యూట్యూబులో KBKJ టీజర్ విడుదలైంది. సల్మాన్ ఖాన్ చరిష్మా, స్టైల్ ముఖ్యంగా మూడు విభిన్న మేకోవర్లలో కనిపిస్తూ సినిమాపై ఎక్జయిట్మెంట్ ను మరింత పెంచేశారు. ముందుగా జరిగిన ప్రచారం మేరకు ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ గారు కీరోల్ లో కనిపిస్తున్నారు. అలానే జగపతి బాబు, భూమిక కూడా నటిస్తున్నారు. బిగ్ బాస్ హిందీ రీసెంట్ సీజన్ విన్నర్ షెహనాజ్ గిల్ ఈ సినిమాతోనే బాలీవుడ్ సినీరంగ ప్రవేశం చేస్తుంది.
ఫర్హాద్ సంజి డైరెక్షన్లో యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి పలువురు సంగీత దర్శకులు స్వరాలు సమకూరుస్తుండగా, వారిలో KGF ఫేమ్ రవి బస్రుర్, మన రాక్ స్టార్ DSP కూడా ఉన్నారు. జీ స్టూడియోస్, సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్ లపై సల్మాన్ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


పోతే, ఈద్ 2023 కానుకగా ఈ సినిమా విడుదల కావడానికి రెడీ అవుతుంది.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM