by సూర్య | Wed, Jan 25, 2023, 04:32 PM
కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన 67వ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అప్డేట్ కోసం తలపతి అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు తమిళనాడులో జరిగిన మైఖేల్ ప్రమోషన్స్ లో పాల్గొన్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తలపతి 67 అఫీషియల్ అప్డేట్ పై అభిమానులకు పక్కా క్లారిటీ ఇచ్చి, వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ మేరకు లోకేష్ మాట్లాడుతూ.. వచ్చే నెల మొదటివారంలో ముఖ్యంగా 1,2,3 తేదీలలో తలపతి 67కి సంబంధించిన ఎక్జయిటింగ్ అప్డేట్ రాబోతుందని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
గతంలో విజయ్- లోకేష్ కలయికలో వచ్చిన మాస్టర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఈ కాంబోపై అభిమానుల్లో బోలెడన్ని అంచనాలున్నాయి.