సుధీర్ బాబు బాక్సాఫీస్ "హంట్" రేపటి నుండే..!!

by సూర్య | Wed, Jan 25, 2023, 04:16 PM

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "హంట్". గతేడాది 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" చిత్రంతో ప్రేక్షకులను నిరాశపరిచిన సుధీర్ బాబు ఈ చిత్రంతో ఈసారి ఎలాగైనా ఆడియన్స్ ను మెప్పించి, బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హంట్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం సుధీర్ బాబు బోలెడంత హార్డ్ వర్క్ చేసినట్టు తెలుస్తుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ తో ఈ సినిమాలోని హై లెవెల్ ఇంటెన్స్ అండ్ రా యాక్షన్ సీక్వెన్సెస్ కంపోజ్ చెయ్యబడ్డాయి. దీంతో యాక్షన్ ప్రియులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.పోతే, రేపే సుధీర్ బాబు బాక్సాఫీస్ "హంట్" మొదలు కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా హంట్ మూవీ రేపు గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. మహేష్ సూరపనేని ఈ సినిమాకు దర్శకుడు కాగా, శ్రీకాంత్, భరత్ నివాస్ కీరోల్స్ లో నటిస్తున్నారు. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Latest News
 
శాకుంతలం థర్డ్ లిరికల్ వీడియో విడుదల ..!! Wed, Feb 01, 2023, 08:21 PM
మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్..? Wed, Feb 01, 2023, 08:13 PM
తరుణ్ భాస్కర్ 'కీడా కోలా'లో హీరో, హీరోయిన్లు ఉండరా..? Wed, Feb 01, 2023, 08:04 PM
రేపటి నుండే 'రైటర్ పద్మభూషణ్' పెయిడ్ ప్రీమియర్స్ Wed, Feb 01, 2023, 07:51 PM
'మట్టికుస్తీ' నుండి 'మిర మిరపకాయ్' వీడియో సాంగ్ ఔట్ Wed, Feb 01, 2023, 07:39 PM