'ధమాకా' 28 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Wed, Jan 25, 2023, 04:04 PM

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా" సినిమా డిసెంబర్ 23, 2022న తెలుగు మరియు హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 38.27 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, జయరామ్, రావు రమేష్, చిరాగ్ జానీ, అలీ, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'ధమాకా' కలెక్షన్స్ :::::::
నైజాం : 18.16 కోట్లు
సీడెడ్ : 7.46 కోట్లు
UA : 4.67 కోట్లు
ఈస్ట్ : 1.90 కోట్లు
వెస్ట్ : 1.31 కోట్లు
గుంటూరు : 1.93 కోట్లు
కృష్ణా : 1.82 కోట్లు
నెల్లూరు : 1.03 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 38.27 కోట్లు (69.69 కోట్ల గ్రాస్)

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM