కళ్యాణ్‌రామ్ 'అమిగోస్‌' లో బాలయ్య సూపర్‌హిట్ రొమాంటిక్ సాంగ్

by సూర్య | Wed, Jan 25, 2023, 03:24 PM

రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో గత సంవత్సరం ఫాంటసీ డ్రామా 'బింబిసార' తో భారీ హిట్ సాధించిన నందమూరి కళ్యాణ్ రామ్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'అమిగోస్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా కళ్యాణ్‌రామ్ అమిగోస్‌ సినిమాకు సంబంధించిన మేజర్ అప్‌డేట్‌ను వెల్లడించడానికి స్పెషల్ వీడియోను విడుదల చేశారు.


కళ్యాణ్‌రామ్ తన బాబాయ్ అయ్యిన బాలకృష్ణ నటించిన 1992 హిట్ ధర్మక్షేత్రంలోని సూపర్‌హిట్ రొమాంటిక్ సాంగ్ 'ఎన్నో రాత్రిలోస్థయి గాని' సాంగ్ ని అమిగోస్‌లో రీమిక్స్ చేసినట్లు వెల్లడించారు. ఈ పాట వీడియో విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. కోలీవుడ్ కంపోజర్ ఘిబ్రాన్ ఈ పాటను రీమిక్స్ చేసాడు, నిజానికి ఈ పాటను లెజెండరీ ఇళయరాజా స్వరపరిచారు మరియు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్ర పాడారు.

ఈ చిత్రంలో కన్నడ నటి ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఫిబ్రవరి 10, 2023న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి గిబ్రాన్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుంది.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM