ధనుష్ "సార్" ఆడియో లాంచ్ డేట్ ఫిక్స్..?

by సూర్య | Wed, Jan 25, 2023, 01:40 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా, డైరెక్టర్ వెంకీ అట్లూరి రూపొందిస్తున్న లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ "సార్". తమిళంలో "వాతి". తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా నుండి విడుదలైన లిరికల్ సాంగ్స్ శ్రోతలను విపరీతంగా మెప్పిస్తున్న విషయం తెలిసిందే.సోషల్ మీడియాలో నడుస్తున్న తాజా బజ్ ప్రకారం, ఈ సినిమా యొక్క ఆడియో లాంచ్ ఈవెంట్ వచ్చే నెల 4న గ్రాండ్ గా జరిపేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అప్డేట్ కూడా రాబోతుందట.
నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల 17న తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM