ఫ్యాన్స్ ని ఊరించి..ఉసూరుమనిపించిన HHVM టీం ..!!

by సూర్య | Wed, Jan 25, 2023, 01:15 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ "హరిహర వీరమల్లు". క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ నుండి రాబోతున్న తొలి పీరియాడికల్ మూవీ కూడా ఇదే.HHVM ఫస్ట్ గ్లిమ్స్ కు ప్రేక్షకాభిమానుల నుండి విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 26న అంటే రేపు న్యూ గ్లిమ్స్ ను విడుదల చెయ్యబోతున్నట్టు స్వయంగా చిత్రనిర్మాత ఏ ఎం రత్నం గారు రీసెంట్గా జరిగిన ఒక మీడియా ఇంటిరాక్షన్ లో పేర్కొనడంతో, అభిమానులందరూ ఇందుకు సంబంధించిన అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్పటివరకు చిత్రబృందం నుండి ఎలాంటి కదలిక లేకపోవడంతో, HHVM న్యూ గ్లిమ్స్ రేపు రావట్లేదని అర్ధం అవుతుంది. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM