"సైOధవ్" టైటిల్ తో వెంకీ 75 పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్ ఔట్

by సూర్య | Wed, Jan 25, 2023, 11:17 AM

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ గారి ల్యాండ్ మార్క్ మూవీ 'వెంకీ 75' అధికారిక ప్రకటన రీసెంట్గానే జరగ్గా, తాజాగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ కాసేపటి క్రితమే మేకర్స్ స్పెషల్ గ్లిమ్స్ వీడియో విడుదల చేసారు. హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్షన్లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.పోతే, ఈ సినిమాకు "సైoధవ్" టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసారు. పాన్ ఇండియా భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. DOP : మణికందన్, ఎడిటింగ్ : గారి BH. అతి త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతుందని మేకర్స్ ప్రకటించారు.


ఇక, తాజాగా విడుదలైన గ్లిమ్స్ లో వెంకటేష్ ఫియర్స్ అవతార్, రగ్డ్ లుక్ సూపర్బ్ గా ఉంది. ఒక చేత్తో తుపాకీ, మరొక చేత్తో ఏదో ఒక ప్రత్యేకమైన మందు (వాక్సిన్, డోస్) పట్టుకుని, రమ్మను.. నేనిక్కడే ఉంటా అని రౌడీలకు చెప్తారు. 

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM