తమిళనాడులో "మైఖేల్" ప్రమోషన్స్ షురూ..!!

by సూర్య | Wed, Jan 25, 2023, 10:53 AM

రంజిత్ జయకోడి దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం "మైఖేల్". ఈ సినిమాలో యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, దివ్యాన్ష కౌశిక్ జంటగా నటిస్తున్నారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీరోల్ లో నటిస్తున్నారు. వచ్చే నెల 3న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. రీసెంట్గా విడుదలైన మైఖేల్ ట్రైలర్ యూట్యూబ్ లో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ మైఖేల్ ప్రమోషన్స్ ను ప్రారంభించారు. ఈమేరకు  PSG కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, కోయంబత్తూర్, తమిళనాడులో ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మైఖేల్ ప్రచార కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్ కు హీరో సందీప్ కిషన్, హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్, డైరెక్టర్ రంజిత్ జయకొడి, తమిళ్ లో ఈ సినిమాను సమర్పిస్తున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ముఖ్యఅతిథులుగా హాజరు కాబోతున్నారు.  

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM