తన ఆరోగ్యంపై స్వయంగా స్పందించిన విజయ్ ఆంటోనీ ..!

by సూర్య | Wed, Jan 25, 2023, 10:23 AM

మల్టీ ట్యాలెంటెడ్ విజయ్ ఆంథోనీ 'బిచ్చగాడు' సినిమాతో ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ అయ్యారు. 2016లో విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విశేషంగా మెప్పించి, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.కెరీర్ లోనే వెరీ స్పెషల్ ఫిలిం గా చోటు సంపాదించుకున్న బిచ్చగాడు సినిమాకు తాజాగా సీక్వెల్ ను ప్రకటించి, ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ నిమిత్తం మలేషియాలో ఉన్నారు విజయ్ ఆంథోనీ. ప్రమాదవశాత్తు అక్కడ చిత్రీకరణ సమయంలో విజయ్ మేజర్ యాక్సిడెంట్ కు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై పలు రకాల రూమర్లు మీడియాలో హల్చల్ చేస్తుండగా, స్వయంగా విజయ్ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా వీటిపై స్పందించారు.ఇప్పుడే తనకు మేజర్ సర్జరీ జరిగిందని, వీలైనంత తొందరగా అందరి ముందుకు వచ్చి మాట్లాడతానని, తన ఆరోగ్యంపై కన్సర్న్ చూపించిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్తూ.. హాస్పిటల్ బెడ్ పై విజయసూచికనిస్తున్న పిక్ ను విజయ్ షేర్ చేసారు. ఈ సందర్భంగా తనకు దవడ ఎముక మరియు ముక్కు భాగాలకు సంబంధించి సర్జరీ జరిగిందని విజయ్ చెప్పారు.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM