'నాటు నాటు' ఆస్కార్ నామినేషన్ పై జక్కన్న థాంక్యూ నోట్..!!

by సూర్య | Wed, Jan 25, 2023, 09:45 AM

RRR సినిమాలోని నాటు నాటు పాట 95వ ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుని హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి RRR చిత్రబృందానికి ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు అందుతున్నాయి.
ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా శ్రీ ఎస్ ఎస్ రాజమౌళి గారు తన సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ దక్కించుకోవడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ పాట వెనుక ఎంత కష్టం ఉందో ..దానిని గుర్తు చేసుకుంటూ, తన విజువల్ ను స్క్రీన్ పైకి అద్భుతంగా తీసుకొచ్చేందుకు సహాయపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలానే శుభాకాంక్షలను తెలుపుతూ థాంక్యూ నోట్ ను విడుదల చేసారు. పెద్దన్న కీరవాణితో మొదలైన థాంక్యూల పర్వం ఆపై లిరిసిస్ట్ చంద్రబోస్ గారికి, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, BGM అందించిన కాలభైరవ, పాటపాడిన రాహుల్ సిప్లిగంజ్, భైరవ, మెస్మరైజింగ్ పెరఫార్మన్స్ ఇచ్చిన చరణ్, తారక్ లవరకు సాగింది. అభిమానులకు, తన శ్రేయోభిలాషులకు జక్కన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.    

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM