అఫీషియల్ : మరో రీమేక్ తో రాబోతున్న పవన్ - హరీష్ ..!!

by సూర్య | Tue, Jan 24, 2023, 06:49 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న "హరిహర వీరమల్లు" షూటింగ్ పూర్తి కాకుండానే రెండు కొత్త ప్రాజెక్టులు ఎనౌన్స్ చేసి, అభిమానుల్లో ఆసక్తిని రేపారు. పవన్ ఎనౌన్స్ చేసిన రెండు కొత్త ప్రాజెక్టుల్లో డైరెక్టర్ హరీష్ శంకర్ "ఉస్తాద్ భగత్ సింగ్" ఒకటి.
పూజా కార్యక్రమాలతో ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. హరీష్ - పవన్ ల కలయికలో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' రికార్డు బ్రేకింగ్ విజయం సాధించడంతో ఈ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా తమిళ సూపర్ హిట్ "తేరి"కి రీమేక్ అని కొన్నాళ్లుగా జరిగిన ప్రచారం తాజాగా నిజమేనని తెలుస్తుంది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్న దర్శకుడు దశరధ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తేరి మూవీకి ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ అని, ఆ మూవీ మెయిన్ స్టోరీ పాయింట్ తీసుకుని, ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు అన్నివిధాలా మారుస్తున్నట్టు, విడుదల తరవాత తప్పక ఘనవిజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు


 


 


 

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM