'హరిహరవీరమల్లు' పై లేటెస్ట్ బజ్

by సూర్య | Tue, Jan 24, 2023, 06:42 PM

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరి హర వీర మల్లు" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రాక్ లో భారీ స్థాయిలో మౌంట్ చేయబడుతోంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలోని ఆసక్తికరమైన ట్విస్ట్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటర్వెల్‌కు ముందు పెద్ద ట్విస్ట్ ఉందని, అక్కడ నుండి పవన్ కళ్యాణ్ పాత్ర మరో స్థాయికి వెళ్తుందని లేటెస్ట్ టాక్. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమా లవర్స్ కి గూస్ బంప్స్ ఇవ్వడమే కాకుండా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని సమాచారం.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 30, 2023న  విడుదల కానుంది. ఈ సినిమాలో బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాన్-ఇండియా మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Latest News
 
శాకుంతలం థర్డ్ లిరికల్ వీడియో విడుదల ..!! Wed, Feb 01, 2023, 08:21 PM
మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్..? Wed, Feb 01, 2023, 08:13 PM
తరుణ్ భాస్కర్ 'కీడా కోలా'లో హీరో, హీరోయిన్లు ఉండరా..? Wed, Feb 01, 2023, 08:04 PM
రేపటి నుండే 'రైటర్ పద్మభూషణ్' పెయిడ్ ప్రీమియర్స్ Wed, Feb 01, 2023, 07:51 PM
'మట్టికుస్తీ' నుండి 'మిర మిరపకాయ్' వీడియో సాంగ్ ఔట్ Wed, Feb 01, 2023, 07:39 PM