ధమ్కీ : పెప్పీ ట్యూన్ తో ఆకట్టుకుంటున్న 'ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల'

by సూర్య | Tue, Dec 06, 2022, 04:39 PM

నిన్న విడుదలవ్వాల్సిన ధమ్కీ మూవీ ఫస్ట్ సింగిల్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ కొంతసేపటి క్రితమే విడుదలైంది. లియోన్ జేమ్స్ స్వరకల్పనలో రూపొందిన పెప్పీ ట్యూన్ కు సింగర్ ఆదిత్య RK మెలోడియస్ వాయిస్ తోడవ్వడంతో ఈ బీచ్ ఛిల్లింగ్ సాంగ్ వెంటనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఉంది. అలానే యష్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. పూర్ణాచారి లిరిక్స్ క్యాచీ గా ఉన్నాయి.


ఈ సినిమాకు హీరో విశ్వక్ సేనే డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అలానే ఆయనే హీరోగా నటిస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. వణ్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


ఇంకా ఈ సినిమాలో రావురమేష్, తరుణ్ భాస్కర్, అక్షర గౌడ్, రోహిణి, పృథ్విరాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17, 2023లో విడుదల కాబోతుంది.

Latest News
 
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.... కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత Fri, Feb 03, 2023, 12:04 AM
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట Thu, Feb 02, 2023, 11:03 PM
సినిమా సెట్‌లో ప్రమాదం..... బంగ్లా నటి షర్మీన్ అఖీకి గాయాలు Thu, Feb 02, 2023, 10:47 PM
శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త Thu, Feb 02, 2023, 09:00 PM
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM