'పంచతంత్రం' కోసం రాబోతున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు..!!

by సూర్య | Mon, Dec 05, 2022, 10:46 PM

చాన్నాళ్ల తరవాత 'హాస్యబ్రహ్మ' బ్రహ్మానందం గారు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం "పంచతంత్రం".  ఆధునిక ప్రపంచంలోని ఐదు అద్భుతమైన కధలను ఈ సినిమాలో చూపించడం జరిగింది. మోడరన్ సొసైటీ లో మనుషులు, వారి పోకడ, బంధుత్వానికి ఇస్తున్న విలువ... ఇలాంటి ఎన్నో సున్నితమైన అంశాలతో కలబోసిన ఈ సినిమాను హర్ష పులిపాక డైరెక్ట్ చేసారు.


పంచతంత్రం సినిమా డిసెంబర్ 9వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసారు. డిసెంబర్ 7వ తేది రామానాయుడు స్టూడియోస్ లో పంచతంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. విశేషమేంటంటే, ఈ ఈవెంట్ కు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి గార్లు ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు. 


ఈ సినిమాలో కలర్స్ స్వాతి, సముద్రఖని, దివ్యవాణి, నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీ విద్య మహర్షి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ విహారి, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. టికెట్ ఫ్యాక్టరీ, S ఒరిజినల్స్ సంయుక్త బ్యానర్ లపై అఖిలేష్ వర్ధన్, సృజన్ యరబోలు నిర్మించారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM