USA లో కొనసాగుతున్న హిట్ 2 కలెక్షన్ల వేట..!!

by సూర్య | Mon, Dec 05, 2022, 10:16 AM

అడివిశేష్ హీరోగా నటించిన "హిట్ 2" రోజురోజుకూ ప్రజాదరణను పెంచుకుంటూ, బాక్సాఫీస్ వద్ద మ్యాజికల్ నంబర్స్ ను నమోదు చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇండియాలోనే కాక ఓవర్సీస్ లో కూడా హిట్ 2 సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది.


ముఖ్యంగా USA లో 300 + లొకేషన్స్ లో విడుదలైన హిట్ 2 శనివారమే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవ్వగా, మొత్తంగా నిన్నటితో 700కే + డాలర్ మార్క్ ను అందుకుంది. ఇక, రాబోయే శుక్రవారానికి హిట్ 2 USA లో వన్ మిలియన్ మార్క్ ను అందుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


శైలేష్ కొలను డైరెక్షన్లో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు. 

Latest News
 
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM