ఈరోజు సాయంత్రం జరగనున్న "హిట్ 2" సక్సెస్ సెలెబ్రేషన్స్ ..!!

by సూర్య | Sun, Dec 04, 2022, 03:41 PM

శుక్రవారం విడుదలైన హిట్ 2 మూవీకి ప్రేక్షకాభిమానుల నుండి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. క్రిటిక్స్ కూడా హిట్ 2 సినిమాను ఒక రేంజులో పొగిడేస్తూ రివ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హిట్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద చాలా మంచి కలెక్షన్ నెంబర్స్ ను నమోదుచేస్తుంది.


దీంతో మేకర్స్ హిట్ 2 సక్సెస్ సెలెబ్రేషన్స్ ను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఫిలింనగర్లోని రామానాయుడు స్టూడియో గార్డెన్స్ లో హిట్ 2 సక్సెస్ సెలెబ్రేషన్స్ జరగబోతున్నాయి. ఇందులో ప్రతి ఒక్కరూ భాగమయ్యి, హిట్ 2 ను సెలెబ్రేట్ చేసుకోవాలని మేకర్స్ కోరుతున్నారు.


శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని నిర్మించారు. ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

Latest News
 
'ఉస్తాద్ భగత్ సింగ్' పై లేటెస్ట్ బజ్ Fri, May 23, 2025, 04:04 PM
7M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భైరవం' ట్రైలర్ Fri, May 23, 2025, 03:59 PM
'ది రాజా సాబ్' టీజర్ విడుదల ఎప్పుడంటే...! Fri, May 23, 2025, 03:54 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'మాస్ జాతర' Fri, May 23, 2025, 03:49 PM
'కుబేర' రన్ టైమ్ లాక్ Fri, May 23, 2025, 03:41 PM