ఒక్కరోజు గ్యాప్ తో బాక్సాఫీస్ దండయాత్రకు రాబోతున్న సీనియర్ హీరోలు..!!

by సూర్య | Thu, Dec 01, 2022, 08:40 PM

టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి గారు, నందమూరి బాలకృష్ణ గారు వచ్చే సంక్రాంతి బరిలో నువ్వా - నేనా అని పోటీకి దిగబోతున్న విషయం తెలిసిందే.


బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ నటిస్తున్న ఔటండౌట్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ "వాల్తేరు వీరయ్య" జనవరి 2023లో విడుదల కాబోతుందని , అలానే నటసింహం నందమూరి బాలకృష్ణ గారు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటిస్తున్న పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ చిత్రం "వీరసింహారెడ్డి" కూడా జనవరి 2023లోనే విడుదల అవుతుందని మేకర్స్ తెలిపారు. ఈ విషయం అందరికి తెలిసిందే. ఈ రెండు సినిమాల నిర్మాతలు ఒక్కరే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థే ఈ రెండు బిగ్గీస్ ను నిర్మిస్తుంది.


తాజా సమాచారం ప్రకారం, ఒక్కరోజు తేడాతో సీనియర్ హీరోలు బాక్సాఫీస్ దండయాత్రకు బయలుదేరబోతున్నట్టు తెలుస్తుంది. ఈమేరకు వీరసింహారెడ్డి జనవరి 12న, వాల్తేరు వీరయ్య జనవరి 13న థియేటర్లకు రాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఐతే, వీటిపై మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇవ్వవలసి ఉంది.


 

Latest News
 
అన్స్టాపబుల్ : వాడీవేడిగా పవర్ స్టార్మ్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో Sun, Feb 05, 2023, 06:54 PM
రైటర్ పద్మభూషణ్ రెండ్రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు..!! Sun, Feb 05, 2023, 06:34 PM
NTR 32 పై సెన్సేషనల్ బజ్..!! Sun, Feb 05, 2023, 06:29 PM
మేనల్లుడి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సూపర్ స్టార్..!! Sun, Feb 05, 2023, 06:10 PM
డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న ధనుష్ "సార్" Sun, Feb 05, 2023, 05:58 PM