విశ్వక్ సేన్ "ధమ్కీ" నుండి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ..!!

by సూర్య | Tue, Nov 29, 2022, 09:53 AM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటిస్తున్న చిత్రం "ధమ్కీ". విశ్వక్ సేన్ డైరెక్టోరియల్ లో రెండవ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. రీసెంట్గా రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.


తాజా అఫీషియల్ అప్డేట్ ప్రకారం, ధమ్కీ నుండి ఫస్ట్ సింగిల్ 'ఆల్మోస్ట్ పడిపోయిండే' లిరికల్ సాంగ్ రిలీజ్ అప్డేట్ ను అతి త్వరలోనే ప్రకటించబోతున్నట్టు విశ్వక్ సేన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. సరిగమ తెలుగు సంస్థ ధమ్కీ మూవీ మ్యూజిక్ రైట్స్ ను సొంతం చేసుకుంది.


లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషలలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM