అఫీషియల్ : "హిట్ 2" హిందీలో కూడా ..!!

by సూర్య | Tue, Nov 29, 2022, 09:33 AM

అడివిశేష్ నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ "హిట్ 2". నిన్ననే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. చిత్ర నిర్మాత, నాచురల్ స్టార్ నాని, చీఫ్ గెస్ట్ గా రాజమౌళి, హిట్ ఫస్ట్ కేసు హీరో విశ్వక్ సేన్ సందడి తో హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కోలాహలంగా జరిగింది.


ఈ ఈవెంట్ లో హిట్ 2 హిందీ రిలీజ్ పై అడివిశేష్ సాలిడ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి హిట్ 2 హిందీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే హిందీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తామని తెలిపారు. పోతే, తెలుగులో హిట్ 2 డిసెంబర్ 2న అంటే ఈ శుక్రవారమే ధియేటర్లకు రాబోతుంది. 


మేజర్ సినిమాతో హిందీనాట మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరో శేష్. దీంతో హిట్ 2 టీజర్, ట్రైలర్ లకు బాలీవుడ్ ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది. హిందీలో కూడా హిట్ 2 రిలీజ్ చెయ్యాలని చాలామంది బాలీవుడ్ ఆడియన్స్ రిక్వెస్ట్ మేరకు హిట్ 2 హిందీలో కూడా రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. 

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM