ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్న మెగాస్టార్

by సూర్య | Mon, Nov 28, 2022, 08:03 PM

గోవాలో జరుగుతున్న 53వ ఐఫీ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించారు. ఈరోజు ఐఎఫ్‌ఎఫ్‌ఐ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చివరి రోజు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా చిరంజీవి ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ  కొన్ని దశాబ్దాలుగా ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నానని అన్నారు . ఈ అవార్డుకు కారణమైన ప్రతి ఒక్కరికీ నిండు హృదయంతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చిందని తెలిపారు. అభిమానుల ప్రేమే తనను మెగాస్టార్‌ని చేసిందని, ఈరోజు ఉన్న స్థితికి తీసుకెళ్లిందని, వారికి జీవితాంతం కృతజ్ఞతతో ఉంటానని అన్నారు. రాజకీయాల నుంచి కెమెరా ముందుకు వచ్చిన తర్వాత తనకు సినీ పరిశ్రమ విలువ తెలిసిందని చిరంజీవి వెల్లడించారు.


 


 

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM