![]() |
![]() |
by సూర్య | Mon, Nov 28, 2022, 06:08 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ మూవీ సెట్స్ పైకి వెళ్లి ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. మహేష్ వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది.
ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే తో పాటుగా సెకండ్ హీరోయిన్ రోల్ కూడా ఉంటుందని ఎప్పటి నుండో ప్రచారంలో ఉన్న విషయమే. తాజా సమాచారం మేరకు, ఈ సెకండ్ హీరోయిన్ రోల్ లో యంగ్ సెన్సేషన్ శ్రీ లీల నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మేకర్స్ శ్రీలీలను ఈ రోల్ కోసం లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఐతే, అధికారిక ప్రకటన రావలసి ఉంది.
Latest News