'బాబా' రీ రిలీజ్... డబ్బింగ్ పూర్తి చేసిన రజినీకాంత్..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 04:18 PM

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ బ్యూటీ మనీషా కొయిరాలా జంటగా నటించిన చిత్రం "బాబా". 2002 లో విడుదలైన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ కంటెంట్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండడంతో చాలామందికి ఈ సినిమా అంటే ఇష్టం. సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే రజినీకాంత్ అందించారు. లోటస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రజినినే సొంతంగా ఈ సినిమాను నిర్మించారు.


ఈ సంవత్సరంతో బాబా విడుదలై ఇరవై ఏళ్ళు పూర్తవుతున్నాయి. అలానే డిసెంబర్ 12న రజిని బర్త్ డే కూడా ఉండడంతో అతి త్వరలోనే బాబా రీ రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబా సినిమాను కొంత ట్రిమ్ చేసి, మరికొన్ని కొత్త సీన్స్ ను యాడ్ చెయ్యాలని అనుకుంటున్నారట. దీంతో కొత్తగా జత చేసిన సీన్లకు రజిని రీసెంట్గా డబ్బింగ్ చెప్పారు. ఒక రీ రిలీజ్ సినిమాకు రజిని వంటి సూపర్ స్టార్ ఇస్తున్న ఇంపార్టెన్స్, కమిట్మెంట్ నెటిజనుల నుండి ప్రశంసలు అందుకుంటుంది.

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM